గురువారం 24 జూన్ 2021
Cinema - Mar 10, 2021 , 10:38:04

బాఫ్టా బెస్ట్ యాక్ట‌ర్‌కు నామినేట్ అయిన గౌర‌వ్ ఆద‌ర్శ్

బాఫ్టా బెస్ట్ యాక్ట‌ర్‌కు నామినేట్ అయిన గౌర‌వ్ ఆద‌ర్శ్

లండ‌న్‌: బ్రిటీష్ ఫిల్మ్ అకాడ‌మీ ఇచ్చే బాఫ్టా అవార్డుల‌కు .. ఉత్త‌మ న‌టుడి క్యాట‌గిరీలో గౌర‌వ్ ఆద‌ర్శ్ నామినేట్ అయ్యాడు.  ద వైట్ టైగ‌ర్ చిత్రంలో గౌర‌వ్ ఆద‌ర్శ్ అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు.  ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావులు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. బెస్ట్ యాక్ట‌ర్ క్యాట‌గిరీలో నామినేట్ అయిన గౌర‌వ్ ఆద‌ర్శ్‌పై ప్రియాంకా చోప్రా ప్ర‌శంస‌లు కురిపించింది.  ఈ సినిమాకు ఆమే ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌గా ఉన్నారు.  ద వైట్ టైగ‌ర్ సినిమాకు మ‌రో క్యాట‌గిరీలోనూ నామినేట్ అయ్యింది.  బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే క్యాట‌గిరీకి కూడా ఈ సినిమా ఎంపికైంది.  అర‌వింద్ అడిగ రాసిన పుస్త‌కం ఆధారంగా రామిన్ బ‌హ‌రాని ఈ సినిమాను తీశారు. ఆద‌ర్శ్ గౌర‌వ్ బెస్ట్ యాక్ట‌ర్ క్యాట‌గిరీకి నామినేట్ కావ‌డం ప‌ట్ల ప్రియాంకా త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు.  భార‌తీయ న‌టుల‌తో తీసిన సినిమా రెండు బాఫ్టా అవార్డుల‌కు నామినేట్ కావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్రియాంకా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  గౌర‌వ్ ఆద‌ర్శ్ ఆ అవార్డుకు అర్హుడ‌ని ఆమె అన్నారు.  ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అయినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు.  


VIDEOS

MOST READ
logo