గురువారం 24 జూన్ 2021
Health - Mar 06, 2021 , 16:56:29

చిన్నారి రవిని ఆదుకుందాం.. అతనికి నిండైన ఆరోగ్యాన్నిద్దాం

చిన్నారి రవిని ఆదుకుందాం.. అతనికి నిండైన ఆరోగ్యాన్నిద్దాం

.''పిల్ల‌లు పెరిగి పెద్ద‌వాళ్ల‌య్యి సంతోషంగా జీవ‌నం గ‌డుపుతుంటే చూడాల‌నేది ప్ర‌తి త‌ల్లీ,తండ్రి క‌ల‌.  బిడ్డలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. కానీ.. ఇప్పుడు మృత్యువుతో పోరాడుతూ ద‌వాఖాన‌లో ప‌డివున్న నా కొడుకును చూసి విల‌విల్లాడుతున్నా. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న నా కొడుకు‌ ఇంత చిన్న వ‌య‌సులో దవాఖానపాలై మృత్యువుతో పోరాటం చేస్తుంటే చూస్తూ ఉండిపోవ‌డ‌మే త‌ప్ప కాపాడుకోలేక పోతున్నా'' అంటూ పుట్టుక‌తో వ‌చ్చిన గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న చిన్నారి ర‌వి త‌ల్లి సంధ్య ఆవేద‌న ఇది.

 

సంధ్య‌, ర‌త్న‌మ్ దంప‌తులు ప్ర‌స్తుతం కొడుకు దీన‌స్థితిని చూసి శిల‌లుగా మిగిలిపోయారు. ఎప్పుడు త‌మ కొడుకు త‌మ నుంచి శాశ్వ‌తంగా దూర‌మైపోతాడోన‌ని అనుక్ష‌ణం భ‌యంతో బ‌తుకుతున్నారు.  త‌న‌కున్న స‌మ‌స్య చాల‌ద‌న్న‌ట్టు ఈ మ‌ధ్య కాలంలో ర‌వి కుంగుబాటు, తీవ్ర మాన‌సిక ఒత్తిడి లాంటి స‌మ‌స్య‌ల‌తో కూడా స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దిక్కుతోచ‌ని స్థితిలో  ద‌వాఖాన గ‌దిలో ప‌డివున్నాడు. త‌న స్నేహితుల‌ను క‌లువ‌లేక‌పోతున్నాడు.  కానీ.. తాను త్వ‌ర‌గా కోలుకుని బ‌డికి వెళ్లాల‌ని, సంతోషంగా ఆడుకోవాల‌ని కోరుకుంటున్నాడు.


 పుట్టినపుడు ర‌వి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బిడ్డ‌ను చూసి ఆ దంప‌తులు ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డారు. కాలం గ‌డిచేకొద్దీ పరిస్థితులు ఒకేలా ఉండ‌వుగా.. కొన్నేళ్ల తరువాత రవికి వాంతుల‌వ‌డం, ఏదైనా తింటే జీర్ణం కాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. దాంతో అత‌ని త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న పెరిగిపోయింది. వెంట‌నే ర‌విని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ అన్ని ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు ర‌వికి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ చాలా త‌క్కువ‌గా ఉన్నాయని ప‌రిస్థితిని వివ‌రించారు. ర‌వి పుట్టుక‌తోనే హృద‌య సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, అత‌ని గుండె నిర్మాణంలో లోపం ఉన్న‌ద‌ని చెప్పారు. అందుకే అత‌ను ఉన్న‌ట్టుండి అక‌స్మాత్తుగా అనారోగ్యం బారిన ప‌డుతుంటాడ‌ని, ఈ స‌మ‌స్యకు శ‌స్త్ర‌చికిత్సే ప‌రిష్కార‌మ‌ని తెలిపారు.

వైద్యులు చెప్పింది విని సంధ్య బోరును విల‌పించింది. ఆ చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేక విల‌విల్లాడింది. త‌న బిడ్డ మోములో ఎప్పుడూ న‌వ్వులు విర‌బూసేవ‌ని తలుచుకుని ఆ త‌ల్లి తల్లడిల్లుతున్న‌ది. ఏం కాదులే అని భార్యకు ధైర్యం చెప్తూనే కొడుకుకు చికిత్స ఎలా చేయించాలో తెలియక రత్నంలో ఆందోళ‌న మొద‌లైంది.

దయచేసి రవికి నిండైన ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.... ఇప్పుడే విరాళం అందజేయండి


 ''ఓ బిడ్డ‌కు తండ్రి కాగానే క‌లిగే సంతోషం, బిడ్డ‌ను మొద‌టిసారి చేతుల్లోకి తీసుకున్న‌ప్పుడు క‌లిగే ఆనందం నిజంగా ఒక అద్భుతం. కానీ ఇప్పుడు ఆ సంతోషం, ఆనందం నాకు దూరమ‌య్యాయి. నా బిడ్డ ఊపిరాడ‌క‌ శ్వాస‌ శ్వాస‌కు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నాడు. తాము ఎలాగైనా  బాగుచేయిస్తామ‌ని వాడు ఆశిస్తున్నాడు. కానీ నేను కేవ‌లం ఒక ఆటో డ్రైవ‌ర్‌ను. నా సంపాద‌న ఇల్లు గ‌డ‌వ‌డానికే స‌రిపోదు. ఇప్ప‌టికే మేం మాకున్న కొద్దిపాటి ఆస్తుల‌ను అమ్ముకున్నాం. అయినా చాల‌క దొరికిన ద‌గ్గ‌ర‌ల్లా చికిత్స కోసం అప్పులు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ‌కు స‌ర్జ‌రీ చేయించ‌డానికి చేతిలో చిల్లిగ‌వ్వ లేక నిస్స‌హాయంగా మిగిలిపోయాం'' అని బాలుడి తండ్రి ర‌త్నమ్ ఆదేద‌న వెలిబుచ్చాడు.

దయచేసి రవికి నిండైన ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.... ఇప్పుడే విరాళం అందజేయండి

 ప్ర‌స్తుతం ర‌త్న‌మ్, సంధ్య దంప‌తులు కష్టాల్లో ఉన్నారు. ర‌వి శ‌స్త్ర‌చికిత్స కోసం రూ.3,50,000 అవ‌స‌రమ‌ని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటానికి అత‌ని తల్లిదండ్రుల‌కున్న ఏకైక అవ‌కాశం దాతలు. మనసున్న మారాజులు ఎవరైనా సహాయం చేయకపోరా అని ఎదురు చూస్తున్నారు.

.

అందుకే వారికి దూర‌మైన సంతోషాల‌ను తిరిగి ద‌గ్గ‌ర‌య్యేలా చేద్దాం. వారిబిడ్డ వారితో క‌ల‌కాలం క‌లిసి ఉండేందుకు మ‌న‌వంతు తోడ్పాడుటును అందిద్దాం. సాయం చేయాల‌నుకునే వాళ్లు ఈ కింద చెప్పిన అకౌంట్ నంబ‌ర్‌కు డ‌బ్బు పంప‌వ‌చ్చు.

అకౌట్ నంబ‌ర్ : 6999413500312857

అకౌంట్ పేరు: Sandhya-Ketto

అకౌంట్ టైప్‌: క‌రెంట్ అకౌంట్‌

ఐఎఫ్ఎస్‌సీ : YESB0CMSNOC

దయచేసి రవికి నిండైన ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.... ఇప్పుడే విరాళం అందజేయండి

VIDEOS

MOST READ
logo