గురువారం 24 జూన్ 2021
National - Mar 10, 2021 , 10:17:19

జ‌ల‌ప్ర‌వేశం చేసిన స‌బ్‌మెరైన్ ఐఎన్ఎస్‌ క‌రంజ్‌

జ‌ల‌ప్ర‌వేశం చేసిన స‌బ్‌మెరైన్ ఐఎన్ఎస్‌ క‌రంజ్‌

ముంబై:  భార‌తీయ నౌకా ద‌ళంలోకి యుద్ధ నౌక ఐఎన్ఎస్ క‌రంజ్‌ చేరింది.  స్కార్పిన్ క్లాస్‌కు చెందిన మూడ‌వ జ‌లాంత‌ర్గామి ఇది.  క‌రంజ్ జ‌ల‌ప్ర‌వేశం సంద‌ర్భంగా.. ముంబైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నేవీ ఈఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌, రిటైర్డ్ అడ్మిర‌ల్ వీఎస్ ష‌కావ‌త్‌లు పాల్గొన్నారు.  గ‌త ఏడు ద‌శాబ్ధాల నుంచి భార‌తీయ నౌకాద‌ళంలో స్వ‌దేశీ ఆయుధాలు పెరిగాయ‌ని, దీని ద్వారా ర‌క్ష‌ణ రంగంలో స్వ‌యంస‌మృద్ధి సాధిస్తున్నామ‌ని నేవీ చీఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ తెలిపారు. ప్ర‌స్తుతం 42 నౌక‌లు, స‌బ్‌మెరైన్లు ఆర్డ‌ర్‌లో ఉన్నాయ‌ని, దాంట్లో 40 నౌక‌లు భార‌తీయ నౌకాశ్ర‌యాల్లోనే నిర్మిస్తున్న‌ట్లు నేవీ చీఫ్ వెల్ల‌డించారు. ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ లేదా స్వ‌దేశీక‌ర‌ణ నినాదం భార‌త నౌకా ద‌ళ పురోగ‌తిలోనే ఉంద‌న్నారు.  

VIDEOS

MOST READ
logo