బుధవారం 23 జూన్ 2021
Telangana - Mar 10, 2021 , 02:47:09

కులాలపై కమలం పిచ్చికూతలు!

కులాలపై కమలం పిచ్చికూతలు!

  • గీత కార్మికులకు అవమానం
  • మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు 
  • మతసామరస్యం దెబ్బతీసేలా చర్యలు
  • ఎన్నికలవేళ బీజేపీ నీచ రాజకీయాలు  
  • ప్రజలు తిరస్కరణతో బీజేపీ సభలు వెలవెల

ఎన్నికలవేళ బీజేపీ నీచపు రాజకీయాలకు తెగబడుతున్నది. ఓటుబ్యాంకు పెంచుకోవడానికి.. సున్నితమైన అంశాలపై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. మరోవైపు బడుగు, బలహీనవర్గాలపై దురహంకార వ్యాఖ్యలు చేస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు కులాలు, మహిళలపై పిచ్చికూతలు కూస్తున్నారు. సబ్బండవర్గాలు వారిని తిరస్కరిస్తుండటంతో బీజేపీ సభలు వెలవెలబోతున్నాయి.

హైదరాబాద్‌, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికలవేళ బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. ఆ పార్టీ నేతలు అన్ని వర్గాలపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న కమలనాథులపై ఆయా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితర నేతల వ్యవహారంపై మండిపడుతున్నాయి. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చెప్తూ.. ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఏడేండ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు.

కించపరిచేలా వ్యాఖ్యలు

ఇటీవల బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారం లో చేసిన వ్యాఖ్యలపై దళితులు మండిపడుతున్నారు. ‘చెప్పులు కుట్టడమే కాదు.. మీకు మొలలు కూడా దించుతారు’ అంటూ దళితులను అవమానపరిచేలా మాట్లాడటంపై ఆ సంఘాలు అగ్రహం వ్యక్తంచేశాయి. మరో సందర్భంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా గీత కార్మికులు కల్లుతో అభిషేకం చేస్తే.. సంజయ్‌ దానిని కూడా విమర్శించారు. గీత కార్మికుల వృత్తినే అవమానపర్చేలా మాట్లాడటంపై ఆ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమవర్గాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని అల్టిమేటం కూడా జారీచేశారు. సమతలు.. మమతలు అంటూ మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గోవులను రక్షించండని చెప్తూ.. మాతృమూర్తులను తీవ్రంగా కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. తల్లు ల ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా..? అంటూ సబ్బండబవర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డా యి. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో రాజాసింగ్‌ హిందూ,ముస్లిం మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సబ్బండవర్గాలు బీజేపీని తిరస్కరిస్తుండటంతో ఆ పార్టీ సభలకు జనంలేక వెలవెలబోతున్నాయి. 

బీజేపీ నేతల నోటిదూల

  • దళితులు చెప్పులు కుట్టడమే కాదు.. మొలలు కూడా దించుతారు అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దళిత ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. 
  • సీఎం కేసీఆర్‌కు గీత కార్మికులు కల్లుతో అభిషేకం చేయగా, దానిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
  • సమతలు, మమతలు అంటూ ఓ సభ లో బండి సంజయ్‌ మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడారు. 
  • గోవులను పూజించాలని కోరుతూ మాతృమూర్తులను కించపరిచేలా రాజా సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. వీటిపై మహి ళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
  • సున్నితమైన అంశాలపై తీవ్రమైన కామెంట్లు చేస్తూ.. ఎన్నికలవేళ మతసామరస్యాన్ని దెబ్బతీసే ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు.

VIDEOS

MOST READ
logo