బుధవారం 23 జూన్ 2021
Telangana - Mar 10, 2021 , 07:38:35

18న తెలంగాణ బ‌డ్జెట్‌!

18న తెలంగాణ బ‌డ్జెట్‌!

అసెంబ్లీ స‌మావేశాలు 15 నుంచి..

హైద‌రాబాద్ : రాష్ర్ట శాస‌న‌స‌భ‌లో ఈ నెల 18న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతారు. ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం అదే రోజు బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. ఈ స‌మావేశంలో శాస‌న‌స‌భ‌, మండ‌లి స‌మావేశాల ఎజెండాను ఖ‌రారు చేయ‌నున్నారు. ఈ నెల 16న మాజీ శాస‌న‌స‌భ్యుడు నోముల న‌ర్సింహ‌య్య మృతికి నివాళుల‌ర్పించ‌నున్న‌ట్లు తెలిసింది.


VIDEOS

MOST READ
logo